ACB | తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు నివాసంలో ఏసీబీ సోదాలు
ఖాజీపేట చైతన్య పురిలో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
సుబేదారి, ఆగస్టు29 : హనుమకొండ జిల్లా ఖాజీపేట చైతన్య పురిలో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నాగేశ్వర్ రావుకు చెందిన నివాసంతో పాటు ఖమ్మం, హైదరాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటుగా మొత్తం ఎనిమిది చోట్ల ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిది ఏసీబీ బృందాలు ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.
కాజీపేటలోని ఆయన ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, కొంత నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వరరావు అక్రమ ఆస్తుల ఆరోపణలపై ఏక కాలంలో ఎనిమిది చోట్ల ఏసీబీ రైడ్స్ చేపట్టడంతో రెవెన్యూశాఖలో కలకలం రేపింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

