ప్రారంభమైన అనంతపద్మనాభస్వామి ఉత్సవాలు

- భారీగా తరలివస్తున్న భక్తులు
- ధ్వజారోహణం, పుణ్యాహవాచనం నిర్వహించిన అర్చకులు
- ఉసిరిచెట్టుకు పూజలు, సహపంక్తి భోజనాలు
- సరదాగా గడిపిన పర్యాటకులు
- నంది ఘాట్ వద్ద ట్రెక్కింగ్
వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహిమగల అనంతపద్మనాభస్వామి పెద్ద జాతర వేడుకలు ఆదివారంతో ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతరకు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ఉన్న ఉసిరిచెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో సేదతీరారు. అటవీ ప్రాంతంలో సరదాగా గడుపుతూ సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం నంది ఘాట్ వద్దకు చేరుకున్న పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు సైతం ఆనందంగా గడిపారు. సాయంత్రం 4 గంటలకు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వెలసిన తినుబండారాలను భక్తులు కొనుగోలు చేశారు.
Read Today's Latest Vikarabad-two News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

