టెన్త్ క్లాస్ అయిపోయే విద్యార్థులు ఇన్నాళ్లు ఆడుతూ పాడుతూ సాగిన పాఠశాల విద్యకు టాటా చెప్పి రంగురంగుల కాలేజీ జీవితానికి హాయ్ చెప్పే సమయం వచ్చింది. ఈ టైంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన తర్వాత ఏంటి ? ఈ ఆలోచన ఏ ఒక్క ప్రశ్నతో ఆగేది కాదు ఇంకో డజను ప్రశ్నలు కూడా మదిలో మెదులుతుంటాయి. ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూపు తీసుకోవాలి, ఏ గ్రూపునకు భవిష్యత్తులో డిమాండు ఉంటుంది? ఏ గ్రూపులో చేరితే త్వరగా స్థిరపడొచ్చు ? ఇలా ఈ ప్రశ్నల ప్రవాహానికి అడ్డూ అంటూ ఉండదు. ఇవి సరిపోవన్నట్లు పక్కింటివారి సలహాలు, దారినపోయే దానయ్య సలహాలు, బంధువుల సలహాలతో బుర్ర మరికొంచం వేడెక్కి మిమ్మల్ని మరింత గందరగోళం చేస్తాయి. అయితే ఈ గందరగోళాన్ని కాస్త పక్కన పెట్టి, మీకు సరిపడా కెరీర్ మార్గాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో, ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా మార్గనిర్దేశం చెయ్యాలో ప్రముఖ కెరీర్ కౌన్సెలర్ డా. శ్రీనివాస్ సలహాలు, సూచనలు ఈ వీడియోలు చూడండి