నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు వైద్యశాలలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఖమ్మం జిల్లాకేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం..ఈ దవాఖానలో అందుతున్న వైద్యసేవలను ఇక్కడ ప్రసవం చేయించుకున్న మహిళల మాటల్లోనే తెలుసుకుందాం రండి..