ఇల్లు పూర్తి కాకముందే గృహ ప్రవేశం చేయవచ్చా? లేదా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. మరి దీనికి ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
ఇంట్లోకి ప్రవేశం ఒక జీవితకాల శుభారంభం. దానిని శాస్త్రోక్తంగా, చక్కగా జరుపుకోవాలి. ఇంటి కల్యాణం, వాస్తుపూజ, హోమం, సత్యనారాయణస్వామి వ్రతం మొదలైన పూజాది కార్యాలతో అన్నపానాది దానాలు, అతిథి సత్కారాలతో జరపాలి. తొందర పనికిరాదు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాన్ని పూజ లోపే పూర్తి చేసుకొని ముహూర్తం నిర్ణయించుకోవడం మంచిది. కనీసం మూడు రాత్రులు కొత్తింట్లో శయనం, దీపారాధన అవసరం. ఇంట్లో అన్ని పనులు పూర్తయినప్పుడే కదా, ఇదంతా సాధ్యం. కాబట్టి, ఇల్లు అయ్యాకే ప్రవేశం జరుపుకోవడం మంచిది. కనీసం పూజగది, పడక గదులు పూర్తి కాకుండా గృహ ప్రవేశం జరుపకూడదు.
– సుద్దాల సుధాకర్ తేజ, suddalavasthu@gmail.com, Cell: 7993467678