ప్రతి రోజు కొత్త కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్, పొడవైన స్కిన్‌కేర్ రొటీన్ల మధ్య ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అదే స్కిన్ సైక్లింగ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పద్ధతి, చర్మానికి విశ్రాంతి ఇస్తేనే మెరుగైన ఫలితాలు అందిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉత్పత్తులు వాడటం కాదు, సరైన క్రమంలో వాడటమే ఈ ట్రెండ్ ప్రత్యేకత.
స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రతిరోజూ ఒకేలా కాకుండా, నాలుగు రోజుల సైకిల్లో మార్చుతూ ఉపయోగించడాన్ని స్కిన్ సైక్లింగ్ అంటారు. దీని వల్ల చర్మంపై ఒత్తిడి తగ్గి, ఇరిటేషన్‌కు అవకాశాలు కూడా తగ్గుతాయి. రాత్రిపూట దీన్ని ప్రయత్నించడం మంచిది.
మృత చర్మాన్ని తొలగించేందుకు తేలికపాటి ఎక్స్ఫోలియేటర్ వాడాలి. ఇది చర్మ తత్వాన్ని బట్టి ఎంచుకోవాలి.
రెటినాల్ ఆధారిత ఉత్పత్తులు చర్మ పునరుద్ధరణకు సాయపడతాయి. కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
మాయిశ్చరైజర్, హైడ్రేటింగ్ ఉత్పత్తులతో చర్మానికి విశ్రాంతి ఇవ్వాలి. దానికి కోలుకునే వీలు కల్పించాలి.
ఈ పద్ధతి వల్ల ఓవర్ స్కిన్‌కేర్ తగ్గుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మ తత్వం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా మారుతుంది. తక్కు వ ఖర్చుతో, తక్కువ సమయంతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చనే కారణంతో యువత ఎక్కువగా దీనిని ఫాలో అవుతున్నారు.