Scarf Made with dogs fur : 18 వేలు పెట్టి పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకుంది
పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ | సాధారణంగా ఉన్ని, దుప్పటి లాంటి క్లాత్‌ల కోసం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేస్తారు. కానీ
సాధారణంగా ఉన్ని, దుప్పటి లాంటి క్లాత్‌ల కోసం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేస్తారు. కానీ.. ఈ మహిళ మాత్రం ఏకంగా.. తన పెంపుడు కుక్కల నుంచి తీసిన బొచ్చుతో సొంతంగా స్కార్ఫ్‌ను తయారు చేయించుకుంది. దాని కోసం 18 వేల రూపాయలను ఖర్చు పెట్టింది. వింతగా ఉన్నా.. తను చేసిన ఈ పని వెనుక ఉన్న కారణం తెలిస్తే మాత్రం శభాష్ అంటారు.

మైకెల్లె పార్కర్ అనే మహిళకు రెండు బొచ్చు కుక్కలు ఉన్నాయి. ఒక దాని పేరు లుకా… రెండో దాని పేరు కీషోండ్. లుకా వయసు 4 ఏళ్లు. ఇంకోదాని వయసు 12 ఏళ్లు.
ఒకరోజు ఫేస్బుక్లో మైకెల్లె.. ఓ ఫేస్బుక్ పోస్టును చూసింది. అందులో ఉన్న ఫోటోలో ఓ వ్యక్తి కుక్క బొచ్చుతో చేసిన స్కార్ఫ్‌ను ధరించడం చూసింది. పెంపుడు జంతువుల బొచ్చుతో స్కార్ఫ్‌ను తయారు చేసే వాళ్లను వెతికి పట్టుకొని.. తన పెంపుడు కుక్కల నుంచి హెయిర్ తీసి.. తనకు స్కార్ఫ్ చేయించుకుంది. దీనికి తనకు 18 వేల రూపాయలు ఖర్చు అయ్యాయి.
అయితే.. తను ఇలా ఆ పెంపుడు కుక్కల బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఆ కుక్కలు ఎప్పుడూ నాతో ఉండవు కదా. ఏదో ఒకరోజు నన్ను అవి విడిచి వెళ్లిపోతాయి. అప్పుడు నా దగ్గర ఉండే వాటి జ్ఞాపకం ఇదే.. అందుకే దీన్ని నేను ఎంతో ఇష్టంతో తయారు చేయించుకున్నా. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో మాత్రమే దీన్ని వేసుకున్నా. తర్వాత దీన్ని భద్రంగా దాచిపెట్టా.. అంటూ మైకెల్లె పార్కర్ చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

