న్యూఢిల్లీ : బీచ్ టూర్ అనగానే ముందుగా సన్‌స్క్రీన్ లోషన్, సన్‌గ్లాసెస్, స్విమ్మింగ్ సూట్లతో ముస్తాబవుతుంటారు. కానీ బీచ్ ఫ్యాషన్‌కు దేశీ మహిళ సరికొత్త అర్ధం చెప్పింది. సంప్రదాయ దుస్తులతో దేశీ మహిళ బీచ్‌లో నడుచుకుంటూ వెళుతున్న వీడియో ట్విట్టర్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
अरे काकी कहां पहुंच गई 😂😂 pic.twitter.com/tQkIsGRuWD
— Rishika gurjar (@Rishikagurjjar) August 22, 2022
రిషిక గుర్జార్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. బీచ్‌లో బికినీలు వేసుకుని అక్కడి వాతావరణాన్ని మహిళలు ఆస్వాదిస్తుండగా వారి మధ్యన దేశీ మహిళ సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. భారత సంస్కృతి గొప్పతనం మన ట్రెడిషన్లోనే ఉందంటూ మహిళపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 98,000 మందికి పైగా వీక్షించారు.