Revenge Ad | ‘నీవెంత మోసగాడివో అందరికీ తెలిసిపోతుంది..’ భర్త చీటింగ్‌పై భార్య పేపర్ ప్రకటన
Revenge Ad | తన భర్త నీచమైన మోసాన్ని పబ్లిక్కు తెలిసేలా ఓ దినపత్రికలో ఫుల్‌పేజీ ప్రకటన ఇచ్చింది. కనుబొమ్మలు ముడుచుకు పోయేంతగా ఆశ్చర్యపోయే ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్శించింది.
Revenge Ad | ‘‘డబ్బులు ఊరికే రావు..’’ అంటూ టీవీల్లో ఊదరగొట్టిన ఓ సంస్థ వాణిజ్య ప్రకటన మనందరికీ ఎంతో జ్ఞాపకంగా ఉండిపోతుంది కదూ!. అంటే పత్రికలు, టీవీల్లో వచ్చే ప్రకటనలు మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయం ఈ ఆవిడకు తెలిసిపోయినట్లుంది కాబోలు. అందుకే తన భర్త నీచమైన మోసాన్ని పబ్లిక్కు తెలిసేలా ఓ దినపత్రికలో ఫుల్‌పేజీ ప్రకటన ఇచ్చింది.
కనుబొమ్మలు ముడుచుకుపోయేంతగా ఆశ్చర్యపోయే ఈ ప్రకటన ఆస్ట్రేలియాకు చెందిన వార పత్రిక మాకే అండద్ విట్సండే లైఫ్‌లో అచ్చయి అందరి దృష్టిని ఆకర్శించింది. ఓ నెటిజెన్ ఈ ప్రకటనను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తన భర్తపై ఉన్న అసంతృప్తిని, కోపాన్ని వార పత్రికలో యాడ్ రూపంలో ప్రదర్శించింది. మోసగాడైన తన భాగస్వామికి సంబంధించిన విషయాన్ని ఫుల్ పేజీ ప్రకటన రూపంలో ఇచ్చి అతడ్ని అవమానించింది. ఈ ప్రకటన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్లో జనం విరుచుకుపడుతున్నారు.
‘‘ప్రియమైన స్టీవ్, మీరు ఆమెతో సంతోషంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో ఇప్పుడు ఊరందరికీ తెలిసిపోతున్నది.. జెన్నీ’’ అంటూ సారాంశంతో కూడిన యాడ్ ప్రచురించింది.
మోసగాడైన భాగస్వామిపై ఆమె కోపం అంతటితోనే తీరలేదు. ప్రకటనలో చివరగా ఒక నోట్ పెట్టింది తనకెంత కోపం ఉందో వెల్లడించింది.
‘‘పీఎస్.. నేను మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ ప్రకటన స్థలాన్ని కొనుగోలు చేశాను’’ అని నోట్లో రాసింది.
గమ్మత్తేంటంటే.. ఈ ప్రకటనను చదివిన చాలా మంది స్టీవ్ ఎవరు.. జెన్నీ ఎక్కడుంటుంది.. అనే విషయాలను ఆరా తీసేందుకు వారపత్రిక కార్యాలయానికి ఫోన్ చేస్తున్నారు.
కాగా, నెటిజెన్లు మాత్రం వెరైటీగా రియాక్ట్ అవుతున్నారు. వెల్డన్ జెన్నీ అంటూ ప్రశంసలు కురిపించిన వారు కూడా ఉన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

