కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదని అంటుంటారు. మనుషులకు కుక్కలంటే అంత నమ్మకం. కానీ, కొలంబియాలో ఓ కుక్క యజమానిపైనే దాడి చేసింది. కిందపడి రక్తం కారుతున్నా వదల్లేదు. ఐదో ఫ్లోర్లో ఉన్న ఆ మహిళా యజమాని ఇతరుల సాయం కోసం లిఫ్ల్లో కిందికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా, ఆ శునకం లిఫ్ట్‌లోనూ యజమానిని వదిలిపెట్టలేదు. ఫస్ట్ ఫ్లోర్‌కి రాగానే వదిలేసింది.
ఈ ఘటన కొలంబియాలో జరిగింది. ప్రాడోస్ జిల్లాలో ఉన్న తన అపార్ట్మెంట్లో మహిళ షూలేస్లను కట్టుకుంటుండగా తన బ్లాక్ పిట్ బుల్ డాగ్ దాడిచేసింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ లిఫ్ట్ ఎక్కింది. ఆమెతోపాటే కుక్క కూడా లిఫ్ట్‌లోకి వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చేదాకా కరుస్తూనే ఉంది. ఆ మహిళ రక్తం కారుతుండగా లిఫ్ట్ బటన్ నొక్కుతూ కనిపించింది.
లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే కుక్కు కూడా ఆమె వెంటే వెళ్లింది. అయితే, బయట ఆ యజమాని బంధువు ఆమెను కుక్కనుంచి రక్షించాడు. ప్రస్తుతం ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నదని మెట్రోపాలిటన్ పోలీస్ మేజర్ అర్లే డేవిలా తెలిపారు. ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఆ బ్లాక్ పిట్ బుల్‌ను ప్రవర్తనా విశ్లేషణ కోసం కుకుటాలోని జూనోసిస్ సెంటర్‌కు పంపామన్నారు.
Meu Deus s na Colômbia está mulher sofre um ataque de Pit Bull! pic.twitter.com/rdmpM5eNDV
— Margoberndpin🇧🇷🇧🇷🇧🇷 (@Margo06971686) March 20, 2022