బాహుబలి చూసినవారు ఆ సినిమాను జన్మలో మర్చిపోరు. అలాగే, అందులో హీరో ప్రభాస్ ఏనుగెక్కే సీన్ ఇష్టపడనివారుండరు. తొండంపైనుంచి ప్రభాస్ ఏనుగెక్కుతుంటే థియేటర్లన్నీ చప్పట్లతో మార్మోగాయి. అచ్చు అలాంటి సీనే ఓ చోట కన్పించింది. ఓ మావటి ప్రభాస్‌లా ఏనుగెక్కుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
ఈ 13 సెకన్ల నిడివిగల వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మావటి ఏనుగు తొండంపైనుంచి దానిపైకి స్టైల్‌గా ఎక్కుతాడు. ఇది అచ్చం బాహుబలిలో ప్రభాస్ స్టైల్లా ఉందని దీపాన్షు కాబ్రా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే 32,000 వ్యూస్ వచ్చాయి.
He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g
— Dipanshu Kabra (@ipskabra) March 30, 2022