VIRAL VIDEO: మూడు కోబ్రాలతో యువకుడి ఆట..చివరికి ఏమైందంటే?
కొందరు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతారు. కానీ ఓ వ్యక్తి మూడు ప్రమాదకరమైన కోబ్రాలతో ఆటాడుకున్నాడు. వాటి తోకలు లాగుతూ..వాటిని రెచ్చగొడుతూ స్టంట్స్ చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు అందులో ఒక కోబ్రా అతడిని కాటేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కొందరు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతారు. కానీ ఓ వ్యక్తి మూడు ప్రమాదకరమైన కోబ్రాలతో ఆటాడుకున్నాడు. వాటి తోకలు లాగుతూ..వాటిని రెచ్చగొడుతూ స్టంట్స్ చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు అందులో ఒక కోబ్రా అతడిని కాటేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కర్ణాటక రాష్ట్రంలోని సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్ పాములు పట్టడంలో నిపుణుడు. వాటితో ఆటాడుకుంటూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు. ఈ యూట్యూబ్ చానల్లో అతి ప్రమాదకరమైన పద్ధతిలో ఇతడి వీడియోలుంటాయి. కాగా, మూడు కోబ్రాలతో అతడు అతి ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. అయితే, అందులో ఒక కోబ్రా అకస్మాత్తుగా అతడి మోకాలును పట్టుకుంది. షాక్కు గురైన సయ్యద్ వదిలించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నందా ట్విటర్లో షేర్ చేశారు. ఇలా పాములతో ఆడడం చాలా ప్రమాదకరమని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, నాగుపాము కాటేసిన సయ్యద్ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు స్నేక్బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రియాంక కదమ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అతడికి 46 యాంటీ-వీనం ఇంజక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc— Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

