Clever Elephant | ఏనుగు తెలివి చూశారా.. తీగల్లో కరెంటు లేదని ఈజీగా కనిపెట్టేసింది..Viral video
Clever Elephant | ఏనుగులు అనగానే.. వాటి భారీ శరీరం, చాటల్లా వెడల్పాటి చెవులు, తొండం గుర్తుకొస్తాయి. వాటి ఆకారం చూడముచ్చటగా ఉంటుంది. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయితే, భారీ ఆకారంలో ఉండే ఈ ఏనుగులు చాలా తెలివైనవని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏనుగులు ఎంత తెలివైనవో తెలియజేసే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Clever Elephant: ఏనుగులు అనగానే.. వాటి భారీ శరీరం, చాటల్లా వెడల్పాటి చెవులు, తొండం గుర్తుకొస్తాయి. వాటి ఆకారం చూడముచ్చటగా ఉంటుంది. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయితే, భారీ ఆకారంలో ఉండే ఈ ఏనుగులు చాలా తెలివైనవని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏనుగులు ఎంత తెలివైనవో తెలియజేసే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రిజర్వ్ ఫారెస్ట్‌లలో అడవి మృగాలు బయటికి రాకుండా ఆ అటవీ మార్గంలోని రోడ్డుకు ఇరువైపుల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంటారు. అలాగే ఏర్పాటు చేసిన ఓ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దగ్గరికి ఓ ఏనుగు వచ్చింది. ఆ ఫెన్సింగ్ దాటి రోడ్డు ఆవలకు వెళ్లాలనేది దాని ఉద్దేశం. కానీ ఫెన్సింగ్‌కు కరెంటు ఉందేమోనని అది సందేహించింది. తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు తెలివిగా ప్రవర్తించింది.
ముందుగా ఫెన్సింగ్లోని ఒక్కో తీగను కాలితో అంటీ అంటనట్టుగా టచ్ చేస్తూ చెక్‌చేసింది. ఆ తీగల్లో కరెంటు సరఫరా లేదనే నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఆ తీగలకు సపోర్టుగా ఉన్న గుంజను కాలితో తోక్కేసి ఫెన్సింగ్‌ను పడగొట్టింది. ఆ తర్వాత దర్జాగా రోడ్డు దాటి అవతలి వైపు అడవిలోకి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్వటర్ హ్యాండిల్లో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.
ఏనుగు తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఏనుగు ఫెన్సింగ్‌కు కరెంట్ చెక్ చేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
Elephant carefully tests electric fence before removing it
pic.twitter.com/E1RpQQiP6x— Science girl (@gunsnrosesgirl3) March 1, 2024
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

