తండ్రీకూతురు ప్రేమ భలే ఉంటుంది. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంటుంది. తండ్రీకూతుళ్ల ప్రేమను చూపే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కూతురు స్కూల్ బస్దిగగానే తండ్రి వెరైటీ కాస్ట్యూమ్‌లో దర్శనమివ్వగా, భయపడి పరుగులు పెడుతుంది. ఆమె వెంటే తండ్రి పరుగెడతాడు. ఇందులో ప్రేమ ఎక్కడుందనేగా మీ అనుమానం..
యూఎస్‌లోని ఓహియోకు చెందిన బీ లవేన్ ప్రతి సోమవారం ఓ వెరైటీ గెటప్‌లో స్కూల్ బస్ దగ్గర వేచిచూస్తాడు. తన పెద్ద కూతురు అడ్డీ లవేన్ బస్సు దిగగానే సర్ప్రైజ్ ఇస్తాడు. కాగా, ఈసారి భయంకరమైన డ్రెస్‌లో లవేన్ దర్శనమివ్వగా, అడ్డీ భయపడినట్లు నటించి పారిపోయింది. ఆమె వెంటే బీ లవేన్ కూడా పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
అసలు విషయం ఏంటంటే వాళ్లు ఉంటున్న క్రెస్టలైన్ చిన్నగ్రామం. అడ్డీ లవేన్ను బీ లవేన్ 2018లో దత్తత తీసుకున్నాడు. ఆమెను సంతోషంగా ఉంచేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు. వీళ్ల వీడియోలు వాళ్ల గ్రామంతోపాటు నెట్టింట ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతాయి. వీళ్ల బంధం చూశాక తన బిడ్డపై ప్రేమ ఇంకా పెరిగిపోయిందని చాలామంది తండ్రులు కామెంట్ చేయడం విశేషం.