ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంది. అందరూ సోషల్‌మీడియా, మొబైల్ యాప్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు మంచిపనులకోసం వాటిని వాడుతుంటే, మరికొందరు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఓ మహిళ రోజుకొక హోటల్లో ఫ్రీ ఫుడ్ తినేందుకు డేటింగ్ యాప్‌ను వాడుకుంది. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ మహిళ 16 రోజులు వివిధ హోటళ్లలో డిన్నర్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం డేటింగ్ యాప్‌ను ఆశ్రయించింది. ఆ యాప్‌లో 16 మందితో డేటింగ్‌కు ఒప్పుకుంది. రోజుకొక్కరితో వెళ్లి తనకిష్టమైన ఆహారం ఫ్రీగా తిని వచ్చేసింది. బిల్ మాత్రం డేటింగ్ వచ్చిన బాయ్‌ఫ్రెండ్స్ కట్టేవారు. ఈ విషయాన్ని సదరు మహిళ టిక్‌టాక్‌లో వెల్లడించగా, నెటిజన్లనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తిండికోసం మగాళ్లను వాడుకోవడం సిగ్గుచేటు అని ఒకరు కామెంట్ చేయగా, తెలివైన మహిళవు అంటూ కొందరు మెచ్చుకున్నారు.