న్యూఢిల్లీ : ఔత్సాహికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించే వీడియోలకు ఇంటర్నెట్లో కొదవేలేదు. ఈ తరహాలో ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరెంట్ స్తంభాన్ని ఉయ్యాలగా మార్చుకుని దానిపై ఓ మహిళ ఏరోబిక్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
స్ట్రీట్ ల్యాంప్ పోల్‌పై ఆమె చేసిన విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెక్ట్స్ లెవెల్ స్కిల్స్ అనే యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ ధరించిన మహిళ స్ట్రీట్ ల్యాంప్ పోల్‌పై విన్యాసాలు చేసింది.
Amazing Skills and Strength! pic.twitter.com/AG9w7y1EQA
— Next Level Skills (@SkillsLevel) August 20, 2022
మహిళ తన హీల్స్‌ను తీసి ల్యాంప్ పోల్‌ను అవలీలగా ఎక్కి అక్కడున్న ఐరన్ రాడ్‌పై ఏరోబిక్స్ చేయడం చూపరులను ఆకర్షించింది. ఈ వీడియోకు ఇప్పటికే 8.9 లక్షల వ్యూస్ రాగా, నెటిజన్ల నుంచి పలు రియాక్షన్స్ వచ్చాయి. ఆమె రిస్క్ చేస్తోందని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, మహిళ ధైర్యం, ఆమె శక్తియుక్తులను మరికొందరు యూజర్లు ప్రశంసించారు. ప్రాణాలకు తెగించే స్టంట్స్ ప్రమాదకరమని కొందరు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.