న్యూఢిల్లీ : ఓ బార్లోకి ప్రవేశించి లైవ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ మ్యుజీషియన్తో కలిసి గిటార్ ప్లే చేసిన వీధి శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. బార్లో లైవ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసిన కుక్క ఇంకా కావాలనే మూడ్‌లో మ్యుజీషియన్తో కలిసి గిటార్ వాయించడం చూపరులను ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 43 వేల వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోను నేను రోజంతా చూశానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, క్యూట్ డాగ్ బార్లో చేసిన సందడిని మెచ్చుకుంటూ పలువురు యూజర్లు కామెంట్లతో హోరెత్తించారు. ఈ కుక్కకు మంచి టేస్ట్ ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియో తన హృదయాన్ని మెలితిప్పిందని మరో యూజర్ రాసుకొచ్చాడు.