Pani Puri With Ice Cream | పానీ పూరీ (Pani Puri ) గురించి తెలియని వారు ఉండరు. ఇది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ (Street Food). రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తినకుండా మాత్రం వెనక్కిరారు. కరకరలాడే చిన్నచిన్న పూరీల్లో ఆలూ స్టఫ్ పెట్టి.. ప్రత్యేకంగా తయారు చేసిన పానీలో ముంచి తింటుంటే ఆ మజానే వేరు. ఇప్పటి వరకు మనం ఆలూ స్టఫ్, దహీ పూరీ, కట్టా మీఠాతో కలిపి పానీ పూరీ తిని ఉంటాం.
అయితే, తాజాగా డిఫరెంట్ కాంబినేషన్‌తో పానీపూరీని సర్వ్ చేస్తున్నాడు ఓ వ్యాపారి. వెనిల్లా ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ (vanilla flavoured ice cream)ని పూరీలో స్టఫ్‌గా పెట్టి సర్వ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.