Rocking Horse | స్విస్- ఫ్రెంచ్కు చెందిన అమరీ గుచాన్ అనే పేస్ట్రీ చెఫ్ తన క్రియేటివిటీతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. చాక్లెట్‌తో ఏకంగా రాకింగ్ హార్స్‌ను తయారు చేసి ఔరా..! అనిపించుకున్నాడు. అమరీకి ఇలాంటి శిల్పాలను తయారు చేయడం కొత్తేమీ కాదు. తన అద్భుతమైన క్రియేటివిటీతో చాక్లెట్‌తో ఎన్నో రకాల బొమ్మలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. వీడియో, ఫొటోల రూపంలో వాటిని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో పోస్టు చేసేవాడు.
తాజాగా అమరీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాకింగ్ హార్స్కు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. చాక్లెట్‌తో తయారు చేసిన ఈ రాకింగ్ హార్స్.. అచ్చం ఆటవస్తువులానే ఉండటం విశేషం. దీన్ని మొదటిసారి చూసిన వారెవరైనా ఇది నిజమైన బొమ్మే అనుకుంటారు తప్ప.. దీన్ని చాక్లెట్‌తో తయారు చేసిందిగా గ్రహించరు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన అమరీ… ‘‘చాక్లెట్ రాకింగ్ హార్స్ ! ఇది తినేందుకు, ఆడుకునేందుకు ఉపయోగపడుతుంది..! ఇది ప్రతి పిల్లవాడి కల’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం నోట్లో వేసుకోగానే కరిగిపోయే రాకింగ్ హార్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..!