కత్తి, కర్ర సాముతో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
కర్ర సాము | ఓ పెళ్లి కూతురు కత్తి, కర్ర సాము ప్రదర్శనతో అదరగొట్టింది.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆత్మ రక్షణ కోసం తన చిన్నతనం నుంచే

ఓ పెళ్లి కూతురు కత్తి, కర్ర సాము ప్రదర్శనతో అదరగొట్టింది.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆత్మ రక్షణ కోసం తన చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఆ యువతి.. పెళ్లి ఊరేగింపులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్లు కూడా ఏకంగా 90 నిమిషాల పాటు వివిధ ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు.
తమిళనాడులోని తిరుకోలూరు గ్రామానికి చెందిన పీ నిషా(22) వివాహం రాజ్ కుమార్ అనే వ్యక్తితో ఇటీవలే జరిగింది. అయితే వివాహ అనంతరం నిర్వహించిన ఊరేగింపులో.. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్యతో నిషా అదరగొట్టింది. మొదటగా ఫ్లెక్సిబుల్‌గా ఉండే కత్తులతో ప్రదర్శన ఇచ్చింది. అనంతరం కర్ర సామును ప్రదర్శించింది. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే. ఇక నిషాకు తోడుగా ఆమె ఫ్రెండ్స్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో తాము నేర్చుకున్న విద్యలను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు.
అమ్మ, నాన్నల ప్రోత్సాహం వల్లే
ఆడ పిల్లలకు ఆత్మ రక్షణ అనేది చాలా అవసరం. ఈ క్రమంలోనే మా అమ్మ, నాన్నలు మార్షల్ ఆర్ట్స్ కు పంపేవారు. అక్కడ ఆత్మరక్షణకు సంబంధించిన అనేక విద్యలను నేర్చుకున్నాను. అమ్మాయిల్లో ఒక అవగాహన కల్పించేందుకు పెళ్లి ఊరేగింపులో తనకు వచ్చిన విద్యను ప్రదర్శించాను అని నిషా తెలిపింది.
Tamilnadu Bride performance Martial Arts, stuns crowd with 'Surul Vaal' (Flexible sword) and Silambam to promote traditional Martials Arts. pic.twitter.com/6VHLiQTI2d
— Pramod Madhav (@PramodMadhav6) July 1, 2021
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

