Chicken in Veg dish | వెజ్ ఆర్డర్లో చికెన్ ముక్క.. కోపగిస్తే రూ.70 వెనక్కిచ్చారు.. సినీ గీత రచయితకు చేదు అనుభవం
Chicken in Veg dish | కార్న్ ఫ్రైడ్ రైస్‌తో గోబి మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ చేతికొచ్చి నోట్లో ముద్దపెట్టగానే చికెన్ ముక్క దర్శనిమిచ్చింది. ఆ సంస్థ చేసిన దారుణ తప్పిదానికి తాను చెల్లించిన రూ.70 తిరిగిచ్చి...
Chicken in Veg dish | హోటళ్లలో ఒక ఫుడ్‌కు బదులుగా మరో ఫుడ్ సర్వ్ చేయడం.. ఆహారంలో పురుగులు పడటం వంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. హోటళ్లలో వంటగదులు అపరిశుభ్రంగా ఉంటున్నాయనే ఫిర్యాదులు కోకొల్లలు. అలాంటి ఫొటోలు, వీడియోలు ఎందరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నా వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు.
చెన్నైలో నివసించే కో శేష తమిళ సినిమా పాటలు రచిస్తుంటాడు. ఇటీవల కార్న్ ఫ్రైడ్ రైస్‌తో గోబి మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ చేతికొచ్చి నోట్లో ముద్దపెట్టగానే చికెన్ ముక్క దర్శనిమిచ్చింది. ‘పుట్టినప్పటి నుంచి నాన్ వెజ్ అంటే ఏంటో తెలియని తనతో నాన్‌వెజ్ ఫుడ్ తినిపించిన స్విగ్గీ.. నా మతపరమైన మనోభావాలను కించపరిచింది’ అని స్విగ్గీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినట్లు కో శేష వెల్లడించాడు.
అయితే, స్విగ్గీ కస్టమర్ కేర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించిందో తెలుసా..? గీత రచయిత కో శేషకు రూ.70 తిప్పిపంపింది. ఆ సంస్థ చేసిన దారుణ తప్పిదానికి తాను చెల్లించిన రూ.70 తిరిగిచ్చి అదేదో పరిహారం కింద అందించినట్లు ఫోజు కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.70 రీఫండ్ చేయడం ద్వారా తన విలువల్ని పాతిపెట్టడానికి ప్రయత్నించిన స్విగ్గీ.. కనీసం జరిగిన పొరపాటుకు ఏ మాత్రం చింతించలేదని కో శేష విచారం వ్యక్తం చేశారు. వెజ్ ఫుడ్‌లో వచ్చిన చికెన్ ముక్కతో ఉన్న ఫొటో, స్విగ్గీ బిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. కాగా, ట్విట్టర్ బయో ప్రకారం.. కో శేష తమిళ గీత రచయితగానే కాకుండా రచయిత, దర్శకుడు, నటుడు, వ్యాపారవేత్త కూడా.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

