Sea Cucumber | ‘సీ కుకుంబర్’ జీవిని ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్..
Sea Cucumber | సముద్ర గర్భంలోని వింత జీవుల గురించి దాదాపు ప్రతిరోజు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ‘సీ కుకుంబర్’ అనే సముద్ర జీవిని బయటపెట్టారు.
ఈ భూమండలం ఎన్నో జంతుజీవాలకు ఆవాసంగా నిలిచింది. లక్షల సంఖ్యలో జీవులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మనం పదుల సంఖ్యలోనే జంతువులను చూసి ఉంటాం. భూమితోపాటు సముద్రం కూడా జీవులకు మర్మప్రదేశం. సముద్రజలాల్లో కొన్నింటినే గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇంకా లెక్కకు మిక్కిలి జంతువులను కనిపెట్టాల్సి ఉన్నది. సముద్ర గర్భంలోని వింత జీవుల గురించి దాదాపు ప్రతిరోజు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ‘సీ కుకుంబర్’ అనే సముద్ర జీవిని బయటపెట్టారు.
ఈ ‘సీ కుకుంబర్’ వీడియో ఆన్లైన్లో కనిపించి నెటిజెన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వింత జీవితం ఆహారం తీసుకునే విధానం చూసి నెటిజెన్లు కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. దాని నోరు చుట్టూ ఉన్న టెంటకీల్స్ వంటి వాటితో ఆ జీవి ఆహారం తీసుకుంటున్న తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను రెండు రోజుల్లోనే దాదాపు 16 వేల మంది వీక్షించారు. అలాగే పెద్ద సంఖ్యలో లైకులు అందుకున్నది.
‘సీ కుకుంబర్’.. సముద్రం అట్టడుగున నేలను ఆంటుకుని జీవనం సాగించే ఎకినోడెర్మ్స్. సూక్ష్మ జీవులను తింటూ బతికే ఈ జంతువును కూడా కొందరు ఆహారంగా తీసుకుంటారట. దీని శరీరం ఆకృతి పొడవాటి దోసకాయ మాదిరిగా ఉండటంతో ‘సీ కుకుంబర్’ అని పేరు పెట్టారంట. ఈ సీ కుకుంబర్లో 1,250 రకాల జాతులున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారంట. ఇవి 1.9 సెంటీమీటర్ల నుంచి 6 ఫీట్ల వరకు పొడవు ఉంటాయి.
Sea cucumber eating, using its feet looking like tentacles surrounding its mouth. pic.twitter.com/3jMyVGGyBt
— Susanta Nanda IFS (@susantananda3) August 2, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

