Viral Video | తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో అందనంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు ఎల్లప్పూడు తోడుగా ఉంటారు. వారి ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు సైతం చేస్తుంటారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రాత్రి పగలు కష్టపడతారు. అనుకున్నది సాధించి వారి ముందు సగర్వంగా నిలబడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు.
క్రుతద్న్యా హేల్.. ఎయిర్‌బస్ 320కి పైలట్. ఒక రోజు విమానంలో ఆమె తండ్రి ప్రయాణించాడు. దీంతో థ్రిల్‌గా ఫీలైన ఆమె ఫ్లైట్ టేకాఫ్ ముందు తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. అనంతరం ప్రేమగా కౌగలించుకుంది. దీంతో ఆ తండ్రి కూతురి విజయాన్ని కళ్లారా చూసి భావోధ్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన క్రుతద్న్యా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ‘టేకాఫ్‌కు ముందు మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నేను ఎప్పుడైనా సరే నా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లను. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మా తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉంటారు. అయినా వారి పాదాలను తాకకుండా నేను వెళ్లను’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.