ఓ శుకనం అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆ డాగ్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అర్ధ్రా ప్రసాద్ అనే యువతి క్లాసికల్ డ్యాన్ చేస్తోంది. ఆమె వెనుకాలే ఓ కట్టెకు పెంపుడు కుక్కనే కట్టేశారు. యువతి డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే.. ఆ శునకం కూడా లేని నిల్చుంది. వెనుక కాళ్లపై నిలబడిన ఆ కుక్క.. యువతిని అనుకరిస్తూ ముందరి కాళ్లను ఆడించింది. శునకం స్టెప్పులకు అందరూ షాక్ అయ్యారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను శ్రీజిత్ త్రిక్కర అనే నెటిజన్ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.