60 ఏళ్లు దాటిన వృద్ధులు నడిచేందుకే ఇబ్బంది పడతారు. కొందరు కర్రసాయం లేనిదే నడవలేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ అద్భుతం చేశారు. ఒకేసారి 107 మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులు స్కైడైవ్ చేసి ఆశ్చర్యపరిచారు. ప్రపంచ రికార్డు తృటిలో కోల్పోయారు. కాగా, ఈ వార్త వైరల్గా మారింది.
స్కైడైవర్స్ ఓవర్ సిక్ట్సీ (ఎస్ఓఎస్) గ్రూప్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. ఇందులోని 107 మంది దక్షిణ కాలిఫోర్నియాలో ఎగురుతున్న విమానం నుంచి స్కైడైవ్ చేశారు. ఈ ఫీట్ చేసేందుకు ముందు చాలాసార్లు ట్రయల్స్ వేశారు. చివరగా విజయవంతంగా స్కైడైవ్ చేసి ఆశ్చర్యపరిచారు. అయితే, వాతావరణం సహకరించికపోవడంతో 75 మందిమాత్రమే ఫీట్లో ఉన్నారు. దీంతో గిన్నిస్ రికార్డు తృటిలో తప్పిపోయింది. కానీ, వారి ప్రయత్నం వైరల్ అయ్యింది.