న్యూఢిల్లీ : గోల్గప్ప, పానీపూరి (Viral Post) ఇలా పేరేదైనా దీన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. జపాన్ ప్రధాని, భారత్‌లో జపాన్ రాయబారి ఈ టేస్టీ స్నాక్పై ప్రశంసలు గుప్పించారు. గోల్గప్పా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్నాక్‌గా పేరొందింది. ఈ టేస్టీ స్నాక్ మనుషులకే కాదు జంతువులూ దీన్ని ఇష్టంగా ఆరగిస్తారు. గుజరాత్‌లోని తంకారలో కోతులు పానీపూరిని ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్లిప్‌లో కోతి పానీపూరి విక్రేత స్టాల్లోకి వచ్చి దానిపై కూర్చుండటం కనిపిస్తుంది. పానీపూరి విక్రేత గోల్గప్పాలను సిద్ధం చేసి కోతికి అందించగా అది ఇష్టంగా తినడం చూడొచ్చు. తంకారలోని దయానంద్ చౌక్‌లో ఈ ఘటన జరగ్గా దీన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో స్ధానికులు స్టాల్ వద్ద గుమికూడారు.
Read More :
Pat Cummins: హెల్మెట్, బ్యాట్ పడేసి.. విక్టరీ రన్ ఎంజాయ్ చేసిన కమ్మిన్స్.. వీడియో