Pat Cummins: హెల్మెట్, బ్యాట్ పడేసి.. విక్టరీ రన్ ఎంజాయ్ చేసిన కమ్మిన్స్.. వీడియో
Pat Cummins: విన్నింగ్ రన్ కొట్టిన కమ్మిన్స్ ఆ సంబరాన్ని ఫుల్ ఎంజాయ్ చేశాడు. విక్టరీ రన్ తీసిన సమయంలో.. కమ్మిన్స్ తన చేతుల్లో ఉన్న బ్యాట్‌ను వదిలేశాడు. హెల్మెట్‌ను కూడా తీసి పడేశాడు. ఆ జోష్‌లోనే లియాన్‌ను తన చేతులతో ఎత్తుకున్నాడు. అపూర్వ శైలిలో విజయాన్ని నమోదు చేసిన కమ్మిన్స్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. అయిదో రోజు చివరి సెషన్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్( Pat Cummins) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న సమయంలో.. కమ్మిన్స్ అసాధారణ రీతిలో ఆసీస్‌కు విక్టరీని అందించాడు. కమ్మిన్స్, లియాన్ ఇద్దరూ కలిసి 9వ వికెట్‌కు అజేయంగా 55 రన్స్ జోడించి అనూహ్య విజయాన్ని రికార్డు చేశారు. విన్నింగ్ రన్ కొట్టిన కమ్మిన్స్ ఆ సంబరాన్ని ఫుల్ ఎంజాయ్ చేశాడు. విక్టరీ రన్ తీసిన సమయంలో.. కమ్మిన్స్ తన చేతుల్లో ఉన్న బ్యాట్‌ను వదిలేశాడు. హెల్మెట్‌ను కూడా తీసి పడేశాడు. ఆ జోష్‌లోనే లియాన్‌ను తన చేతులతో ఎత్తుకున్నాడు. అపూర్వ శైలిలో విజయాన్ని నమోదు చేసిన కమ్మిన్స్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. కమ్మిన్స్ విక్టరీ రన్ తీస్తూ ఎంజాయ్ చేసిన వీడియో ఇదే.
The iconic finish this match deserved 🤌
📹 | Relive the winning moment from an exhilarating 1st Test in #TheAshes 🤩#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/qTQ9RiWGQg
— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2023
ఆసీస్ బోణీ..
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుణుడి దోబూచులాట మధ్య చివరి వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 281 పరుగుల లక్ష్యఛేదనలో 107/3తో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. చివరకు 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (197 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధశతకంతో వీరోచితంగా పోరాడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (28), అలెక్స్ కారీ (20) విలువైన పరుగులు జత చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి గెలుపు కష్టమే అనుకున్న దశలో ఆసీస్ గొప్పగా పోరాడింది. లియాన్ (16 నాటౌట్)తో కలిసి కమిన్స్ 9వ వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించడంతో కంగారూలు విజయం సాధించారు. ఖవాజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

