Viral Video: గర్భిణిగా నటించేందుకు రోజంతా ప్రయత్నించాడు.. కానీ ఏం జరిగిందో తెలుసా..?
Viral Video: సాధారణంగా గర్భం దాల్చడం అనేది మహిళల జీవితంలో అత్యంత ఉద్విగ్నమైన సందర్భం..! ఆ తీయని బాధాకరమైన సందర్భం కోసం ప్రతి మహిళ ఎదురుచూస్తుంటుంది. అయితే, నవమాసాలు బిడ్డను మోసి ప్రసవం అయ్యేసరికి మహిళలు

Viral Video : సాధారణంగా గర్భం దాల్చడం అనేది మహిళల జీవితంలో అత్యంత ఉద్విగ్నమైన సందర్భం..! ఆ తీయని బాధాకరమైన సందర్భం కోసం ప్రతి మహిళ ఎదురుచూస్తుంటుంది. అయితే, నవమాసాలు బిడ్డను మోసి ప్రసవం అయ్యేసరికి మహిళలు ఎదుర్కొనే సవాళ్లు అన్నీఇన్నీ కావు. మహిళ శరీరంలో కూడా భౌతికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులను భరించడం అంత సులువు కాదు.
ప్రెగ్నెన్సీ సమయంలో తాము శారీరకంగా, మానసికంగా పడుతున్న అవస్థలను ఇంట్లో మగవాళ్లు నిజంగా అర్థం చేసుకుంటున్నారా.. లేదా..? అనే ప్రశ్న గర్భిణీల్లో ఉదయించడంతోనే వారిలో సంఘర్షణ మొదలవుతుంది. కానీ, నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో ఒత్తిడి ఏ స్థాయిలో కేవలం గర్భం దాల్చిన మహిళలకు మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు కలిగే బాధ కూడా కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అనుభవంలోకి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే గర్భిణీలు పడే మానసిక, శారీరక అవస్థలను స్వతహాగా అనుభవించి చూసేందుకు ఓ టిక్‌టాకర్ ప్రయత్నించాడు. కానీ, అతని ప్రయత్నం విఫలమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిట్లాండ్ హాన్లీ అనే వ్యక్తి ఓ పాపులర్ టిక్‌టాకర్. అయితే, అతడు ఒక గర్భిణిగా నటిస్తూ వీడియో తీసుకునేందుకు.. పొట్టపై భారీ వాటర్ మిలన్‌ను అమర్చుకున్నాడు. ఆ తర్వాత ఛాతి భాగం విశాలంగా కనిపించడం కోసం రెండు చిన్న వాటర్ మిలన్లను అంటించుకున్నాడు.
అయితే, నిండు గర్భిణిగా నటించేందుకు హాన్లీ ఒంటి బరువును అయితే పెంచుకోగలిగాడు గానీ, ఆ బరువుతో లేచి తిరగడం తాను ముందుగా ఊహించినంత సులువు కాదని త్వరగానే తెలుసుకున్నాడు. తాను తన శరీరాన్ని గర్భిణిలా బరువుగా మార్చుకోగలిగాను గానీ, కానీ బరువతో రోజంతా ప్రయత్నించినప్పటికీ కనీసం మంచం మీద నుంచి కిందకు దిగలేకపోయాను అని చెప్పారు. అయితే, ఈ విఫల వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను కోటి 70 లక్షల మంది వీక్షించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

