King Cobra | కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. దాన్ని చూస్తేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పాన్ని ఓ వ్యక్తి ఏకంగా ముద్దాడాడు. తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఈ సాహసానికి ఒడిగట్టాడు. ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
వావా సురేశ్… పాములు పట్టడంలో దిట్ట. కేరళ ప్రాంత ప్రజలు ఇతన్ని ‘స్నేక్ మెన్ ఆఫ్ కేరళ’ అని కూడా పిలుస్తుంటారు. ఇతను ఎలాంటి పామునైనా సునాయాసంగా పట్టుకోగలడు. ఇప్పటి వరకు 38వేలకు పైగా పాములను పట్టుకున్న అనుభవం ఉంది. అందులో 190కిపైగా కింగ్ కోబ్రాలే ఉండటం విశేషం. తాజాగా అతడు ఓ భారీ కింగ్ కోబ్రాను ముద్దాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వరైల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతన్నారు. ఇంకెందుకు ఆలస్యం ‘స్నేక్ మెన్ ఆఫ్ కేరళ’ సాహసాన్ని మీరూ చూడండి.