ఆరున్నర దశాబ్ధాల కిందట కాలేజ్ డ్రాపవుట్ : 88 ఏండ్ల వయసులో డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు!
విజ్ఞానం పొందడం, ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల ఆసక్తి ఉండాలే కానీ అందుకు వయసు అడ్డంకి కాబోదు. అందుకే మనం ఏ వయసులో ఉన్నా నేర్చుకోవాలనే తపనను కోల్పోరాదని పెద్దలు చెబుతుంటారు. ఆరున్నర దశాబ్ధాల కిందట చదువును అర్ధంతరంగా నిలిపివేసిన 88 ఏండ్ల వ్యక్తి కాలేజ్ ఎడ్యుకేషన్‌ను పట్టుదలతో పూర్తిచేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
న్యూయార్క్ : విజ్ఞానం పొందడం, ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల ఆసక్తి ఉండాలే కానీ అందుకు వయసు అడ్డంకి కాబోదు. అందుకే మనం ఏ వయసులో ఉన్నా నేర్చుకోవాలనే తపనను కోల్పోరాదని పెద్దలు చెబుతుంటారు. ఆరున్నర దశాబ్ధాల కిందట చదువును అర్ధంతరంగా నిలిపివేసిన 88 ఏండ్ల వ్యక్తి కాలేజ్ ఎడ్యుకేషన్‌ను పట్టుదలతో పూర్తిచేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
జాన్ లెనెహన్ (88) 1956లో ఫోర్ధమ్ యూనివర్సిటీలో చేరాడు. ఆపై తన సొంత పట్టణంలో ఉద్యోగం రావడంతో చదువుకు స్వస్తిపలికాడు. కొన్నేండ్లకు లెనెహన్ కొరియా యుద్ధంలో పాల్గొనేందుకు సైన్యంలో చేరాడు. కెరీర్లో కుదురుకుని చక్కని కుటుంబంతో స్ధిరపడ్డాడు. అయితే కాలేజ్ చదువును పూర్తిచేయకపోవడం ఆయనను నిత్యం వెంటాడుతుండేది. ఓ రోజు ఉదయం తాను తిరిగి ఫోర్డమ్ యూనివర్సిటీకి వెళుతున్నానని భార్యతో చెప్పాడు.
తాను తిరిగి కాలేజ్ చదువును పూర్తి చేసేందుకు యూనివర్సిటీకి మళ్లీ అనుమతిస్తారా అని అధికారులను కోరడంతో వారు అంగీకరించారు. అంతా ప్రణాళిక ప్రకారం సాగడంతో గత వారం 88 ఏండ్ల లెహనన్ ఇతర విద్యార్ధులతో కలిసి తన సర్టిఫికెట్‌ను అందుకున్నారు. లెహనన్కు ఆరుగురు సంతానం కాగా 13 మంది మనవళ్లు ఉన్నారు. పట్టుదల ఉండాలే గానీ వయసు ఎంతమాత్రం అవరోధం కాదని ఈ తాత నిరూపించాడని లెహనన్పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

