Jaguar Power | నీటిలోకి దూకి.. మొసలిని నోట కరిచి.. వావ్! ఇదీ చిరుత పవర్.. వీడియో వైరల్
Jaguar Power | మొసలి.. దాన్ని చూడగానే మన ఒళ్లు గగుర్పొడుస్తుంది. పెద్ద పెద్ద దంతాలతో నోరు తెరిచి మన వైపు అది వస్తుందంటే.. మన ప్రాణాలు పైపైనే పోవడం ఖాయం. అంతటి భయంకరమైన జంతువును మరో జంతువు అలవోకగా...
Jaguar Power | మొసలి.. దాన్ని చూడగానే మన ఒళ్లు గగుర్పొడుస్తుంది. పెద్ద పెద్ద దంతాలతో నోరు తెరిచి మన వైపు అది వస్తుందంటే.. మన ప్రాణాలు పైపైనే పోవడం ఖాయం. అంతటి భయంకరమైన జంతువును మరో జంతువు అలవోకగా నోటి కరుచుకుని ఎంచక్కా పారిపోయింది. ఇంతకీ ఏమిటా జంతువు అనే కదా మీ అనుమానం.. మీరంతా అనుకుంటున్నట్లుగానే అది చిరుతపులి.
కాలువ గట్టున చెట్ల గుబుర్లలో ఓ చిరుతపులి అదను కోసం ఎదురుచూస్తూ ఉన్నది. కాలువలో ప్రశాంతంగా ఈదుకుంటూ తన ఆహారం కోసం ప్రయత్నిస్తున్న మొసలి కాస్తా.. ఈ చిరుతపులి కంట పడింది. ఇంకేముంది ఒక్క ఉదుటున లగెత్తి నీటిలోకి దూకింది. మొసలిని పట్టుకోవడానికి దానితో కొద్దిసేపు యుద్ధం చేసింది. చివరకు నోట కరుచుకుని గట్టుపైకి చేరి కనుమరుగైంది.
OMG what a power!! pic.twitter.com/LHZazN2zwP
— Figen (@TheFigen) August 14, 2022
ఈ వీడియోను ది ఫైజన్ అనే వ్యక్తి ట్విట్టర్లో సోమవారం నాడు పోస్ట్ చేశాడు. నిజానికి ఈ వీడియోను రెండేండ్ల క్రితమే వాహ్సీ హయత్లార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈనాటికీ ఆ వీడియో వైరల్ అవుతుండటం విశేషం. ఈ వీడియోను 2.6 లక్షలకు పైగా జనం వీక్షించగా 27 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ట్విట్టర్లో రీ షేర్ చేయడం విశేషం. చిరుతపులి నోటి ఎముకలు ఎంత దృఢంగా ఉంటాయో చెప్పే వీడియో ఇది అని ఒక నెటిజెన్ వ్యాఖ్యానించగా.. చిరుతపులి చాలా ఆకలిగా ఉన్నట్లుగా ఉన్నదని మరో నెటిజెన్ రాశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

