*గంగూబాయి కతియావాడి* సినిమాలోని పాట *ధోలిడా* ఎంత హిట్టయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటపై బాలీవుడ్ నటి అలియాభట్ అద్భుతంగా నర్తించింది. ఇప్పుడు ఎవ్వరుచూసినా ఈ పాటపైనే ఇన్‌స్టా రీల్ చేస్తున్నారు. కాగా, ఓ ఇన్స్టాగ్రాం యూజర్ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎదుట ఈ పాటకు డ్యాన్స్ చేయగా, వైరల్ అయ్యింది.
మాన్సీ పరేఖ్ అనే ఇన్‌స్టా యూజర్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో ఈఫిల్ టవర్ ఎదుట ధోలిడా పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో 13,000 మంది వీక్షించారు. ఇన్‌స్టా యూజర్లంతా మాన్సీ పరేఖ్, ఆమె స్నేహితురాళ్లు వేసిన హుక్‌స్టెప్‌ను కొనియాడుతున్నారు.