న్యూఢిల్లీ : భారతీయ ఆహారం రుచి, వైవిధ్యానికి మారుపేరుగా విశ్వవ్యాప్తమైంది. ప్రపంచం నలుమూలలా ప్రజలు భారతీయ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. మన దేశీ రుచులకు విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. ఆన్లైన్లో వైరల్‌గా మారిన వీడియోలో ఆస్ట్రేలియా మహిళ తొలిసారి మన దేశీ రుచులను ఆస్వాదిస్తూ కనిపించారు.
తన్నర్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారు. నట్క్రాకర్గా పిలిచే ఫేమస్ నంకీన్తో పాటు ఆమె కుర్కురే, అంకుల్ చిప్స్, మథ్రి వంటి అనేక దేశీ స్నాక్స్‌ను రుచిచూశారు. మన సోం పాపిడిని ఇష్టంగా తిన్న ఆస్ట్రేలియన్ మగువ ఈ ఆరు నిమిషాల వీడియోలో పచ్చళ్లనూ రుచిచూశారు. భారతీయ స్నాక్స్‌ను రుచిచూసిన ఆసీ గాల్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.