పెండ్లి వేడుకలో సెలబ్రేటరీ ఫైరింగ్ : కొత్త జంటపై కేసు నమోదు!
పెండ్లి వేడుకలంటే బంధు మిత్రులు కలిసి సందడి చేసే రోజులు కనుమరుగై కాల్పుల మోతతో సంబరాలు చేసుకుంటూ స్ధానికులను భయబ్రాంతులకు లోనుచేస్తున్నారు.
లక్నో : పెండ్లి వేడుకలంటే బంధు మిత్రులు కలిసి సందడి చేసే రోజులు కనుమరుగై కాల్పుల మోతతో సంబరాలు చేసుకుంటూ స్ధానికులను భయబ్రాంతులకు లోనుచేస్తున్నారు. యూపీలోని మీరట్ జిల్లా మవానాలో జరిగిన పెండ్లి ఊరేగింపులో సెలబ్రేటరీ ఫైరింగ్‌కు పాల్పడిన కొత్త జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తుపాకీతో కాల్పులు జరుపుతూ పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు అత్యుత్సాహం ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ వీడియోలో వెడ్డింగ్ పార్టీలోకి కొత్త జంట ఎంట్రీ ఇవ్వగానే పెండ్లి కొడుకు గన్ను బయటకు తీసి గాలిలోకి కాల్పులు జరిపాడు.
పెండ్లి కొడుకు కాల్పులు జరుపుతుండగా చుట్టూ గుమికూడిన వారు చప్పట్లతో మోతెక్కించారు. సెలబ్రేటరీ ఫైరింగ్ ఘటనలో కొత్త జంటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో తమ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని మీరట్ ఎస్పీ కేశవ్ కుమార్ తెలిపారు. ఫైరింగ్‌లో ఉపయోగించిన గన్ వారికి ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- bride
- Celebratory Firing
- groom
- UP
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

