సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా ( Neeraj chopra )కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు.. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు.. అనేదేనా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం ఆగండి.
నిజానికి.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, నీరజ్ చోప్రాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు కానీ.. మీరు నీరజ్.. నీరజ్.. నీరజ్.. నీరజ్.. అని అదే పేరును జపిస్తూ వెళ్లండి. నీరజ్ పోయి రజనీ వస్తారు. అవును.. కంటిన్యూగా నీరజ్.. నీరజ్.. అని అంటుంటే.. ఆ పేరు కాస్త రజనీగా మారుతుంది. ఏంటి.. ఇది చదువుతూనే.. మీలో మీరు నీరజ్.. నీరజ్.. అంటూ జపం చేశారు కదా. కరెక్టే.. రజనీ పేరు వస్తుంది అని అనుకుంటున్నారు కదా.
సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటా ఉంటారు. చివరకు ఒలింపిక్స్‌లోనూ ఆయన పేరును జపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సీక్రెట్ అర్థమయిందా? అంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు పెడుతున్నారు నెజటిన్లు. నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ 2020, నీరజ్ గోల్డ్ చోప్రా హ్యాష్‌టాగ్‌లతో దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. అలా.. సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారన్నమాట.
#WeekendWisecrack#WhatsAppWonderBox
— KN Vaidyanathan (@KNVaidy) August 7, 2021
f you chant Neeraj Neeraj Neeraj, you will hear Rajni Rajni Rajni.
Now you know the secret.
Rajnikant is everywhere.😂#NeerajChopra #Olympics2021 #SuperStar
If you chant Neeraj Neeraj Neeraj, you will hear Rajni Rajni Rajni. Now you know the secret of #NeerajGoldChopra Rajnikant is everywhere. 😂😂#TokyoOlympics2020 #NeerajChopra #whatsappwonderbox
— CA Amith Khadloya (@amith_khadloya) August 7, 2021