Harsh Goenka | రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఇక ఇందులో ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ ఆలపించిన కేసరియా సాంగ్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఈ రొమాంటిక్ పాటను వినేందుకు ఇష్టపడుతున్నారు.
తాజాగా ఈ పాటకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కూడా ఫిదా అయ్యారు. ఇటీవల లండన్ వీధుల్లో ఓ వ్యక్తి బాలీవుడ్ పాటను పాడుతున్న వీడియోను గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘లండన్ వీధుల్లో.. ఈ పాట ఎంత మనోహరంగా ఉంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో ఓ వ్యక్తి లండన్లోని రద్దీ రహదారిపై కూర్చొని కేసరియా పాటను ఆలపిస్తూ కనిపిస్తాడు. స్థానికులు అతని చుట్టూ చేరి పాటను ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇతి హాసాలను ఆధారంగా చేసుకొని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీల పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
Meanwhile in the main roads of London….what a lovely beat this song has! pic.twitter.com/0XOsic4TLu
— Harsh Goenka (@hvgoenka) October 30, 2022