నూతన వధూవరులకు వాళ్ల స్నేహితులు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి అక్కడున్న బంధుమిత్రులందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటనే కదా మీ అనుమానం. పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. అవును మరి ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 120, లీటర్ డీజిల్ ధర 104. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెరిగాయి. మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 10 మేర పెరిగింది. దీంతో పెట్రో ధరల పెంపుపై ఒక్కొక్కరు ఒక్కోతీరుగా నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే వధూవరులకు వారి స్నేహితులు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిప్ట్గా ఇచ్చారు. ఈ వీడియోను జీ న్యూస్ ట్విటర్లో పోస్ట్ చేయగా, వైరల్ అవుతోంది.
महंगाई का असर: दूल्हा-दुल्हन को दोस्तों ने गिफ्ट में दी पेट्रोल-डीजल से भरी 2 बोतलें#PetrolDieselPrice pic.twitter.com/GaOkdkFxEf
— Zee News (@ZeeNews) April 7, 2022