Viral Video: వరుడి మెడలో డబ్బుల దండ… కొన్ని నోట్లు చోరీ చేసిన స్నేహితుడు
న్యూఢిల్లీ: వరుడి మెడలోని డబ్బుల దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక చోట పెళ్లి జరుగుతున్నది. ఈ సందర్భంగా వరుడి మెడలో కరెన్సీ దండను వేశారు. పెండ్లి వేదికపై కూర్చున్న పెండ్లికొడుకు బంధువులు చెప్పేది వింటున్నాడు. ఇంతలో అతడికి దగ్గరగా కుర్చీలో కూర్చొన్న స్నేహితుడు చోరీకి ప్రయత్నించాడు. వరుడు ఒకసారి తలతిప్పగా ఆ వ్యక్తి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయితే వరుడు పెండ్లి తంతులో బిజీ కాగా అతడి మెడలో ఉన్న డబ్బుల దండ నుంచి కొన్ని నోట్లు పెకలించిన స్నేహితుడు మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు.
కాగా, ఈ చోరీని ఒకరు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే లక్ష మంది దీనిని చూశారు. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. డబ్బులను చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుందని ఒకరు, ఇది కూడా వ్యాపారమని మరొకరు కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Friend
- Garland
- groom
- Steals Cash
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

