పెన్సిల్ కూడా కొనలేకపోతున్నా… ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి బాలిక లేఖ
లక్నో: కనీసం పెన్సిల్, రబ్బర్ కూడా కొనలేకపోతున్నానని, అవి ఖరీదై పోయాయంటూ ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆ చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1వ తరగతి చదువుతున్నది. ఆమె పెన్సిల్, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్ కొనమని తల్లిని అడుగుతుండగా ఆమె మందలిస్తుంది. ఇది పరిపాటిగా మారింది.

కాగా, ఆదివారం ఆ చిన్నారీ, మ్యాగీ ప్యాకెట్ కొనేందుకు ఐదు రుపాయలతో షాప్‌కు వెళ్లింది. అయితే మ్యాగీ ప్యాకెట్ ధర ఏడు రూపాయలు పెరిగినట్లు షాప్ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ పాప నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. కొత్త పెన్సిల్ కోసం మరోసారి మారం చేయగా తల్లి మందలించింది. టేబుల్స్ రాయమని చెబుతుంది.
అయితే ఆ బాలిక ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి లేఖ రాసింది. ‘ప్రధానమంత్రీ జీ.. నా పేరు కీర్తి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్, ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు’ అని హిందీలో రాసింది.
మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, ధరల పెరుగుదలపై పాప ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీకి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంట్లో గళమెత్తుతున్న తరుణంలో ప్రధాని మెదీకి ఆ చిన్నారి ఈ మేరకు లేఖ రాయడం విశేషం.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

