Shocking : మద్యం తాగడం మానేసి.. మొలలు, స్క్రూలను మింగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మద్యం తాగడం మానేసి.. మొలలు, స్క్రూలను మింగేశాడు | ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. తర్వాత ఎలాగోలా మద్యం తాగే అలవాటును మానేశాడు. కానీ.. ఆ తర్వాత
ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. తర్వాత ఎలాగోలా మద్యం తాగే అలవాటును మానేశాడు. కానీ.. ఆ తర్వాత అతడికి మరో వింత అలవాటు ప్రారంభం అయింది. ఎక్కడ మొలలు, స్క్రూలు కనిపించినా మింగడం ప్రారంభించాడు. అలా ఒక నెల రోజుల పాటు.. మొలలు, స్క్రూలు మింగేశాడు. దీంతో కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ ఘటన యూరప్ లోని లిథువానియాలో చోటు చేసుకుంది.

ఆ వ్యక్తికి స్కాన్ తీసిన డాక్టర్లు అతడి కడుపులో కిలో వరకు పేరుకుపోయి ఉన్న స్క్రూలను చూసి షాక్ అయ్యారు. అవి అన్నీ 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్నట్టు గుర్తించారు. క్లేయిపెడా యూనివర్సిటీ ఆసుపత్రిలో అతడికి సర్జరీ చేసి కడుపులో ఉన్న అన్ని మెటల్ ఆబ్జెక్ట్స్ ను వెలికితీశారు.
బయటికి తీశాక చూస్తే అవి కిలో కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఆపరేషన్ ఎప్పుడూ చేయలేదు. 3 గంటలు కష్టపడి.. అతడి కడపులో ఉన్న.. అన్ని మొలలు, స్క్రూలు, నట్లను బయటికి తీశాం.. అని క్లేయిపెడా యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యుడు అల్గిర్ దాస్ వెల్లడించారు. ఆపరేషన్ సమయంలో తీసిన ఫోటోలు, బయటికి తీసిన మెటల్ ఆబ్జెక్ట్స్ ఫోటోలను ఆసుపత్రి వైద్యులు మీడియాకు విడుదల చేశారు. దీంతో అక్కడ ఈ వ్యక్తి గురించే చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shocking Video : బాలిక ఒడిలో నిద్రపోతున్న పైథాన్
Photo of the Day : సీతాకోకచిలుకలతో గొరిల్లా ఆట.. ఈ ఫోటో చూస్తే వావ్ అనాల్సిందే
వైరల్ పిక్స్ : రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు!
World’s Oldest Living Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయన.. వయసు ఎంతో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

