షాకింగ్… మహిళ కంట్లో 23 కాంటాక్ట్ లెన్స్..!
Contact Lense: కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ లెన్సుల గురించి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు.
Contact Lense: కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ లెన్సుల గురించి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు, వాటిని ఉపయోగించే వాళ్లు కళ్లను రుద్దడం వంటివి చేయకూడదు. ఇక ముఖ్యంగా పడుకునేటప్పుడు కచ్చితంగా వాటిని తీసేసి నిద్రపోవాలి. ఎందుకంటే అవి పొరపాటున కంట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్ లెన్సులు ఉండవు. ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఆమె నిద్రకు ముందు వాటిని తొలగిండం మరిచిపోయి.. ఉదయం మరో కొత్త లెన్స్ పెట్టుకునేది. ఇలా వరుసగా 23 రోజులు చేసింది. చివరకు ఆమెకు కంట్లో నొప్పి రావడం మొదలైంది. భరించలేని నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా… ఆమెను పరీక్షించిన వైద్యులు మహిళ కంట్లో ఏమో ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ వస్తువు సాయంతో కంట్లో ఉన్నవి తీయగా.. 23 కాంటాక్ట్ లెన్స్‌లు బయటపడ్డాయి. ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కాలిఫోర్నియా ఐ అసోసియేట్స్ ఇన్స్టాగ్రామ్ పేజిలో పోస్టు చేశారు. ఈ ఘటనపై వైద్యురాలు కేథరినా కుర్తీవా మాట్లాడుతూ.. ‘‘ నేను ఎంతో జాగ్రత్తగా ఆ కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశాను. అవి మొత్తం 23 ఉన్నాయి. వాటిని కంటి నుంచి బయటకు తీయటానికి మంచి సర్జికల్ వస్తువును వాడాల్సి వచ్చింది. అవి నెల రోజులు కంటి లోపల ఉండిపోవడంతో ఒకదానికి ఒకటి అతుక్కుని ఉన్నాయి’’ అని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

