గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్

హైదరాబాద్: కొవిడ్‌పై పోరులో భాగంగా పూర్తిగా స్వదేశంలోనే అభివృద్ధి చేసిన కొవాగ్జిన వ్యాక్సిన్ సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ తేల్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ రెండో దశ ఫలితాలను విడుదల చేశారు. అయితే వీటి ద్వారా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేయలేని, దీని కోసం మూడో దశ ఫలితాలు అవసరమని లాన్సెట్ తెలిపింది. ఇదో గుడ్ న్యూస్ అని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లోని ఇన్ఫెక్షస్ డిసీజెస్ చీఫ్ ఫహీమ్ యూనస్ ఓ ట్వీట్లో అన్నారు. ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2 ట్రయల్స్‌లో వ్యాక్సిన్ మరింత మెరుగైందని లాన్సెట్ స్పష్టం చేసింది.
ఇక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య కూడా ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2లో తగ్గిందని తెలిపింది. ఈ అధ్యయనం 12-18 ఏళ్ల వయసులు, 55-65 ఏళ్ల వయసు వారిపై జరిగిందని, పిల్లల్లో, 65 ఏళ్లు పైబడిన వారిపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని లాన్సెట్ తెలిపింది. మూడో దశ ట్రయల్స్ ముగియకుండానే గత జనవరిలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన తొలి డోసుగా కొవాగ్జిన్ టీకానే తీసుకున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- corona vaccine
- Covaxin
- Lancet
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

