పెళ్లికూతురుకు లిఫ్ట్ ఇచ్చిన పోలీస్.. సమయానికి పోలీస్ రాకపోయి ఉంటే..!
పెళ్లికూతురుకు లిఫ్ట్ ఇచ్చిన పోలీస్ | అటువంటి పరిస్థితే ఓ పెళ్లికూతురుకు ఎదురైంది. కాకపోతే సమయానికి దేవుడిలా ఓ పోలీస్ వచ్చి తనను పెళ్లి సమయానికి చర్చ్‌కు తీసుకెళ్లాడు.
సాధారణంగా వాహనాల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడెన్‌గా వాహనం ఆగిపోతే ఏం చేస్తాం. దగ్గర్లో ఎవరైనా మెకానిక్ ఉంటే పిలుచుకురావడమో లేక.. వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోవడమో.. ఇలా.. రకరకాల ప్లాన్స్ వేసుకోవాల్సిందే. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పనిమీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా వెహికిల్ బ్రేక్‌డౌన్ అయితే అప్పుడు ఏం చేస్తాం. కొద్ది నిమిషాల్లో తన పెళ్లి జరగనుండగా.. కారులో వెడ్డింగ్ హాల్‌కు వెళ్తున్న ఆ పెళ్లికూతరు కారు ఆగిపోతే ఏంటి పరిస్థితి.

అటువంటి పరిస్థితే ఓ పెళ్లికూతురుకు ఎదురైంది. కాకపోతే సమయానికి దేవుడిలా ఓ పోలీస్ వచ్చి తనను పెళ్లి సమయానికి చర్చ్‌కు తీసుకెళ్లాడు. లేకపోతే.. తన పెళ్లి ఆగిపోయేది.
ఈ ఘటన ఇంగ్లండ్‌లోని నాటింగమ్షైర్లో చోటు చేసుకుంది. లైడియా ఎవన్ అనే 29 ఏళ్ల యువతి పెళ్లి కోసం చక్కగా ముస్తాబు అయింది. తెల్లటి గౌను వేసుకొని కారులో చర్చ్‌కు తన పేరెంట్స్‌తో బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లగానే తన కారు బ్రేక్‌డౌన్ అయింది. కొన్ని నిమిషాల్లో తన పెళ్లి. అక్కడ చూస్తే ఏ వాహనాలు వెళ్లడం లేదు. ఏం చేయాలి.. అని పెళ్లి కూతురు ఆలోచిస్తుండగా.. అటువైపు వెళ్తున్న ఓ పోలీసు.. తన కారును ఆపి.. అసలు విషయం తెలుసుకొని.. పెళ్లికూతురుతో సహా.. ఆమె పేరెంట్స్‌ను కూడా అనుకున్న సమయానికి చర్చ్‌కు తీసుకెళ్లాడు.
దీంతో పెళ్లికూతురు అతడికి ధన్యవాదాలు తెలిపి.. అతడితో ఓ ఫోటో దిగింది పెళ్లికూతురు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే కోవిడ్ వల్ల వాళ్ల పెళ్లి ఒకసారి వాయిదా పడిందట. మళ్లీ ఈసారి కారు బ్రేక్‌డౌన్ వల్ల వాయిదా పడుతుందేమోనని తెగ టెన్షన్ పడ్డామని కొత్త పెళ్లి జంట చెప్పుకొచ్చారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

