Columbia women police | మోడలింగ్ కోసం పోలీస్ ఉద్యోగం వదులుకోను: కొలంబియా మహిళా పోలీసు అధికారిణి
మోడలింగ్ కంటే పోలీస్ ఉద్యోగమే ఇష్టం అంటున్న కొలంబియా మహిళా పోలీస్ ఆఫీసర్
అందమైన అమ్మాయిల్లో చాలామంది మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వంటి పోటీల్లో గెలవాలని కలలు కంటారు. కానీ, కొందరు మాత్రం తమకు నచ్చిన ఉద్యోగంలో చేరతారు. అమెరికాలోని కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్ కూడా అదే పని చేసింది. ఈమెను ప్రపంచంలోని అందమైన పోలీస్ ఆఫీసర్‌గా పిలుస్తారంతా. డయానాను పోలీస్ యూనిఫామ్‌లో చూసినవాళ్లంతా ‘ఇంత అందంగా ఉన్నావు. పోలీస్ ఉద్యోగం మానేసి, మోడల్‌గా లేదంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్‌ని ఎంచుకోవచ్చు కదా!’ అని ఆమెకు సలహాలు ఇస్తుంటారు. కానీ, డయానా మాత్రం పోలీస్ ఉద్యోగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేది.
‘నాకు మళ్లీ కెరీర్‌ని ఎంచుకునే అవకాశం వస్తే.. కచ్చితంగా మళ్లీ పోలీస్ ఆఫీసర్ అవుతాను. ఎందుకంటే.. పోలీస్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. పోలీసుగా విధులు నిర్వర్తించడాన్ని గౌరవంగా భావిస్తాను’ అని డయానా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మోడలింగ్ కోసం పోలీస్ ఉద్యోగం వదులుకోను అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఇన్‌స్టాలో 4 లక్షల మంది ఫాలోవర్స్
ఈమధ్యే ఇన్‌స్టాఫెస్ట్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్‌గా ఆఫ్ ది ఇయర్’గా డయానా నామినేట్ అయింది. డిజిటల్ కంటెంట్‌ని ఎక్కువ మందికి చేరవేస్తన్నవాళ్లని గుర్తించడమే ఈ అవార్డు ఉద్దేశం అని చెప్పింది ఇన్‌స్టాఫెస్ట్ ఇవ్వనున్నారు. దాంతో, డయానా ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరొందిన మెడిలిన్ వీధుల్లో డయానా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

