Candy Officer | చక్కర గోలీ ఆఫీసర్ ఉద్యోగం.. నెలకు రూ.5 లక్షల జీతం..
Candy Officer | క్యాండీల రుచిని ఎప్పటిమాదిరిగా ఉండేందుకు ‘చీఫ్ క్యాండీ ఆఫీసర్-సీసీఓ’ ఉద్యోగిని నియమించుకునేందుకు క్యాండీ ఫన్ హౌజ్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పచ్చజెండా ఊపారు. ఏడాదికి రూ.60 లక్షలు జీతంగా...
ఏ దుకాణంలోనైనా చక్కెర గోలీలను చూడగానే మన నోరూరడం ఖాయం. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల చక్కెర గోలీలను మనం రుచి చూసి ఉంటాం. ప్రస్తుతం ఎన్నో వెరైటీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రకరకాల పేర్లతో మనల్ని ఆకర్శిస్తున్నాయి. అయితే, వీటి తయారీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటి రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేందుకు కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. వీటి రుచి ఎలా ఉన్నాయో చెప్పేందుకు ప్రత్యేక ఉద్యోగులను కూడా కొన్ని కంపెనీలు నియమించుకుని తమ ప్రాడక్ట్‌లను అత్యుత్తమంగా ఉండేలా కాపాడుకుంటుంటాయి.
ఈ కోవకు చెందినదే కెనడాకు చెందిన ఈ క్యాండీ కంపెనీ. ఈ కంపెనీ వివిధ క్యాండీలను ఉత్పత్తి చేసి కెనడాతో పాటు విదేశాల్లో అమ్ముతున్నది. ఈ కంపెనీ నుంచి దాదాపు 3,500 రకాల క్యాండీలను తయారుచేస్తున్నది. తమ క్యాండీల రుచిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అన్ని వయసుల వారిని ఆకర్శిస్తున్నది. అయితే, క్యాండీల రుచిని ఎప్పటిమాదిరిగా ఉండేందుకు ‘చీఫ్ క్యాండీ ఆఫీసర్-సీసీఓ’ ఉద్యోగిని నియమించుకునేందుకు క్యాండీ ఫన్ హౌజ్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పచ్చజెండా ఊపారు.

తమ ఉత్పత్తులను రచి చూసి చెప్పడమే కాకుండా రుచిని కాపాడేందుకు ‘చీఫ్ క్యాండీ ఆఫీసర్’ ఉద్యోగి కావాలంటూ ట్విట్టర్లో సంస్థ ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. ఈ డ్రీమ్ జాబ్‌కు 5 ఏండ్లు పైబడిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి రూ.60 లక్షలు ( లక్ష అమెరికన్ డాలర్లు) జీతంగా ఇవ్వనున్నారు. దరఖాస్తులు ఆగస్ట్ 31 లోగా సంస్థకు చేరేలా పంపుకోవాలి. కెనడియన్లు టొరంటో లేదా నేవార్క్ నుంచి, అమెరికా రెసిడెంట్లు ఇంటి నుంచి విధులు నిర్వర్తించేందుకు అకాశం కల్పిస్తున్నది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

