Viral Video | కోతితో కొట్లాటకు దిగిన కోడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎత్తైన రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి. ఆ రాయి వెనుకాలే ఓ దేవుడి విగ్రహం ఉంది. ఇక కోతి రాయి కొనభాగాన కూర్చొని ఉంది. లోపలి వైపు కోడి.. కోతిపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. దాన్ని కిందకు తోసేందుకు యత్నించింది కోడి. దీంతో కోతి, కోడి మధ్య ఫైటింగ్ బాగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫన్నీ దృశ్యం ఇండియాలోనే ఆవిష్కృతమైంది. ఏ ప్రాంతమో మాత్రం తెలియరాలేదు.