Viral Video | స్విస్- ఫ్రెంచ్కు చెందిన అమరీ గుచాన్ అనే పేస్ట్రీ చెఫ్ తన క్రియేటివిటీతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. చాక్లెట్‌తో పలు రకాల ఆకృతులను అద్భుతంగా తీర్చిదిద్ది ఔరా అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన చాక్లెట్‌తో టెలిస్కోప్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం అమరీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
దీన్ని మొదటిసారి చూసిన వారెవరైనా ఇది నిజమైన టెలిస్కోప్ అనే అనుకుంటారు తప్ప.. చాక్లెట్‌తో తయారు చేసిందిగా గ్రహించరు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన అమరీ… ‘‘చాక్లెట్ టెలిస్కోప్ ! మంచి స్నాక్..’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమరీకి ఇలాంటి శిల్పాలను తయారు చేయడం కొత్తేమీ కాదు. తన అద్భుతమైన క్రియేటివిటీతో చాక్లెట్‌తో ఎన్నో రకాల బొమ్మలను తీర్చిదిద్దాడు. వీడియో, ఫొటోల రూపంలో వాటిని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో పోస్టు చేసేవాడు. ఇటీవల ఆయన చాక్లెట్‌తో రాకింగ్ హార్స్‌ను తయారు చేసి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఆ టెలిస్కోప్‌పై మీరూ ఓ లుక్కేయండి..!