మీకు గుర్తుందా? బిగ్‌బ్యాంగ్ థియరీ 11వ సీజన్లో షెల్డన్ కూపర్, హోవర్డ్ వోలోవిట్జ్ నమూనా రాకెట్‌ను తయారుచేశారు. అది నిజంగానే పనిచేసింది. ఇప్పుడు ఓ ముగ్గురు గల్లీ కుర్రాళ్లు సోడాబాటిళ్లతో రాకెట్ తయారుచేసి, విజయవంతంగా ఆకాశంలోకి వదిలారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ 15 సెకన్ల నిడివిగల వీడియోను సైన్స్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ఇందులో ముగ్గురు కుర్రాళ్లు సోడా బాటిల్స్‌తో రాకెట్‌ను తయారుచేశారు. ముందు కాసేపు అందులో గ్యాస్ నింపారు. అనంతరం ఒక కుర్రాడు కింద ఉన్న లిడ్‌ను తీయగానే న్యూటన్ మూడో నియమం ప్రకారం ఆ బాటిల్స్ రాకెట్ నింగికెగిసింది. చాలాదూరం పోయిన తర్వాత పైన పారాచూట్ ఓపెన్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 32,000 వ్యూస్ వచ్చాయి. చూసినవారంతా వాళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
Physics is very cool pic.twitter.com/nZZuiamLip
— Science is Amazing (@scienceamazng) April 16, 2022