మాస్క్ అంటే ముక్కు, మూతిని కవర్ చేస్తే సరిపోతుంది. కానీ, ఓ కంపెనీ మనం సాధారణ మాస్క్ కంటే 50రెట్లు పెద్దదైన మాస్కును తయారుచేసింది. దీన్ని ఎందుకు తయారుచేశారనేగా మీ అనుమానం..దీని వెనుక ఓ ఆరోగ్యకర ప్రయోజనమే ఉంది. కరోనా సమయంలో మాస్కుపై అవగాహన కల్పించేందుకు దీన్ని తయారు చేశారు. ఈ మాస్కు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది.
ఈ అతిపెద్ద మాస్కును తైవాన్‌కు చెందిన ఓ వైద్య సంస్థ తయారుచేసింది. దీని పొడవు, వెడల్పులు 27 అడుగుల 3 అంగుళాలు, 15 అడుగుల 9 అంగుళాలు. మనం సాధారణంగా ఉపయోగించే మాస్క్ కంటే 50 రెట్లు పెద్దది. ఈ మాస్కు రూపొందించాలనే ఆలోచన కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో తమకు వచ్చిందని తైవాన్‌కు చెందిన మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది. వీడియో చాట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత రికార్డును ధ్రువీకరించారు.