Narsapur forest | వీకెండ్ ఎంజాయ్మెంట్కు కేరాఫ్ అడ్రస్ నర్సాపూర్ ఫారెస్ట్
Narsapur forest | భాగ్యనగరంలో బిజీ లైఫ్ గడిపేస్తున్న మీకు.. వీకెండ్లో ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారా? పచ్చటి అడవిలో కాసేపు సేద తీరాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు.. ప్రకృతి సౌందర్యంతో పరవశించిపోదాం.. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ ఫారెస్టు ( Narsapur forest ) కు పదండి.

భాగ్యనగరంలో బిజీ లైఫ్ గడిపేస్తున్న మీకు.. వీకెండ్లో ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారా? పచ్చటి అడవిలో కాసేపు సేద తీరాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు.. ప్రకృతి సౌందర్యంతో పరవశించిపోదాం.. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ ఫారెస్టు ( Narsapur forest ) కు పదండి.
హైదరాబాద్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ అడవి ( మెదక్ జిల్లా ) ఉంది. వీకెండ్ ఎంజాయ్మెంట్కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సువాసనను వెదజల్లే వృక్షాలు, మనసును ఆహ్లాదపరిచే పక్షులు, సీతాకోక చిలుకలు, సహజశిల నిర్మాణాలు, చెరువులతో మనం మమేకం అయిపోవచ్చు. అడవిలో ఆయా మార్గాల గుండా కోతులతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అడవి అంతా షికారు చేయడంతో పాటు విశ్రాంతి తీసుకోవచ్చు.

అయితే చీకటి పడకముందే తిరిగి రావాలి. ఈ అడవి మార్గం దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడా విరామం తీసుకోకుండా పర్యటిస్తే నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. ఈ ఫారెస్టును సందర్శించడానికి ఇదే సరైన సమయం. అయితే అడవిలో తప్పిపోతామనే సందేహం అవసరమే లేదు. గూగుల్ మ్యాప్స్ ద్వారా సులభంగా మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఆ ఫారెస్టుకు వెళ్లేందుకు అద్భుతమైన రహదారులు ఉన్నాయి. ఈ అడవిలోకి వెళ్లేవారు బొంతపల్లి దేవాలయం నుంచి తమ పర్యటనను ప్రారంభించొచ్చు.
అడవి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలనుకుంటే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును సందర్శించొచ్చు. ప్రవేశ రుసుం రూ. 50 చెల్లించి.. వాచ్ టవర్ నుంచి ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించొచ్చు.
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

